IPL 2025 : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడే క్రమంలో దేవ్‌దత్ పడిక్కల్(27) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అశ్విన్ బౌలింగ్‌లో పడిక్కల్ ఆడిన బంతిని రుతురాజ్ ముందుకు డైవ్ చేస్తూ అందుకున్నాడు. దాంతో, 76 వద్ద రెండో వికెట్ పడింది. ఆ తర్వాత పథిరన, నూర్ అహ్మద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ స్కోర్ నెమ్మదించింది. అయితే.. 10వ ఓవర్ ఆఖరి బంతిని కెప్టెన్ రజత్ పాటిదార్(11) స్టాండ్స్‌లోకి పంపాడు. విరాట్ కోహ్లీ(16) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు బెంగళూరు స్కోర్.. 93-2.
టాస్ ఓడిన బెంగళూరుకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(32), విరాట్ కోహ్లీ(16)లు శుభారంభం ఇచ్చారు. ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలుపెట్టింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(32)ను మెరుపులతో 8.9 రన్‌రేటుతో పరుగులు రావడంతో స్పిన్నర్లను రంగంలోకి దింపిన రుతురాజ్ గైక్వాడ్ ఫలితం రాబట్టాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సాల్ట్‌ను ధోనీ మెరుపు స్టంపింగ్ చేశాడు. దాంతో, 45 వద్ద ఆర్సీబీ మొదటి వికెట్ పడింది. కోహ్లీ జతగా వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్(27) జడేజా బౌలింగ్‌లో 4, 4, 6 బాదడంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.