IND v RSA : భారత్తో సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా(South Africa) ఆలౌట్ ప్రమాదంలో పడింది. లంచ్ సమయానికి సఫారీ జట్టు 7 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్లో బవుమా సేన 147 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆల్రౌండర్ మార్కో జాన్సేన్(72), కగిసో రబడ(1) క్రీజులో ఉన్నారు.
The HUGE wicket of Elgar came via a glove down leg
Tune in to the 1st #SAvIND Test LIVE on @StarSportsIndia pic.twitter.com/uFCx2hV44R
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023
మూడో రోజు కూడా ఓపెనర్ డీన్ ఎల్గర్(185) కొరకరాని కొయ్యలా క్రీజులో పాతుకుపోయాడు. డబుల్ సెంచరీదిశగా దూసుకెళ్తున్న అతడినిను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే గెరాల్డ్ కోఎట్జీ(18)ని అశ్విన్ వెనక్కి పంపాడు. అయితే.. మరో ఎండ్లో మార్కో జాన్సేన్(72) ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని రెండొందలకు పెంచేందుకు జాన్సేన్ ప్రయత్నిస్తున్నాడు.