పుణె: వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ మ్యాచుల్లో అతను 188 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ ప్రారంభమైన రెండో టెస్టులో.. అశ్విన్ ఇప్పటికే రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో అతను డబ్ల్యూటీసీ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. అశ్విన్ తర్వాత స్థానాల్లో నాథన్ లియాన్(187), కమ్మిన్స్(175), స్టార్క్(147), బ్రాడ్(134) ఉన్నారు.
ఇవాళ ఉదయం ఫస్ట్ బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు.. భోజన విరామ సమయానికి 31 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 92 రన్స్ చేసింది. ఆ రెండు వికెట్లను అశ్విన్ తీసుకున్నాడు. ఓపెనర్ టామ్ లాథమ్(15), వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్(18) ఔటయ్యారు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీకి సమీపిస్తున్నాడు. కాన్వే 47, రవీంద్ర 5 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.