అహ్మాదాబాద్: స్పిన్నర్ అశ్విన్(Ashwin) ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. సెంచరీ కొట్టిన గ్రీన్, కీపర్ క్యారీ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగవ టెస్టు(fourth test) రెండో రోజు రెండో సెషన్లో ఇండియాకు బ్రేక్ వచ్చింది. అశ్విన్ వేసిన 34వ ఓవర్లో ఆ రెండు వికెట్లు పడ్డాయి. గ్రీన్ 114 రన్స్‌కు, అలెక్స్ క్యారీ డకౌట్ అయ్యారు.
𝐎𝐧𝐞 𝐛𝐫𝐢𝐧𝐠𝐬 𝐭𝐰𝐨! 🔥🔥
A sigh of relief for #TeamIndia as @ashwinravi99 strikes twice in an over to remove Cameron Green and Alex Carey 💪🏻💪🏻
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/e8caRqCHOq
— BCCI (@BCCI) March 10, 2023
అశ్విన్ వేసిన లెగ్ సైడ్ బంతిని స్వీప్ చేయబోయిన గ్రీన్(green).. కీపర్ భరత్(bharat)కు క్యాచ్ ఇచ్చాడు. ఇక వచ్చీ రాగానే భారీ షాట్ ఆడాలనుకున్న క్యారీ.. అశ్విన్ బౌలింగ్‌లోనే క్యాచ్ అవుట్ అయ్యాడు. థార్డ్‌మ్యాన్ ఏరియాలో ఉన్న అక్షర్ పటేల్(axar patel) ఆ క్యాచ్ పట్టేశాడు.
And Australia lose another one! Carey goes for a duck.#WTC23 | #INDvAUS | 📝 https://t.co/VJoLfVSeIF pic.twitter.com/9tHcPdbI6F
— ICC (@ICC) March 10, 2023
ప్రస్తుతం 133 ఓవర్లలో ఆసీస్ ఆరు వికెట్లకు 384 రన్స్ చేసింది. ఖవాజా 164, స్టార్క్ 4 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.