Ashwin : రెండో టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన రవిచంద్రన్ అశ్విన్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో అతను 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అశ్విన్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెటర్ విన్స్టన్ బెంజమిన్ పేరిట ఉంది. 1808లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 40 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. మొదట బౌలింగ్‌లో 6 వికెట్లు తీసిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అదరగొట్టాడు. శ్రేయాస్ అయ్యర్‌తో 71 పరుగులు జోడించి జట్టుని గెలిపించాడు. దాంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం టీమిండియా 99 పాయింట్లతో ఉంది. ఆస్ట్రేలియా 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
8వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం
ఈ మ్యాచ్‌లో అశ్విన్-అయ్యర్ జోడీ భారత జట్టు తరఫున 8వ వికెట్‌కు రెండో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఈ జంట 71 పరుగులు చేసింది. అమర్ సింగ్, లాల్ సింగ్ జోడీ మొదటి స్థానంలో ఉంది. వీళ్లు 1932లో ఇంగ్లండ్‌తో లార్డ్స్ మైదానంలో 8వ వికెట్‌కు 74 పరుగులు జోడించారు. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ – ఎల్ శివరామకృష్ణన్ జోడీ మూడో స్థానంలో ఉంది. వీళ్లిద్దరూ 1985లో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్టులో 70 రన్స్ చేశారు.