భారత లెజెండరీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రికార్డును వెటరన్ అశ్విన్ బ్రేక్ చేశాడు. కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ ఈ ఫీట్ సాధించాడు. న్యూజిల్యాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ (52) వికెట్ కూల్చిన అశ్విన్.. హర్భజన్ సింగ్‌ను అధిగమించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యథిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు.
అశ్విన్ కన్నా ముందు దిగ్గజ బౌలర్లు అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత హర్భజన్ (417) వికెట్లతో మూడో స్థానంలో ఉండేవాడు. అయితే అశ్విన్‌కు లాథమ్ వికెట్ 418 వది. ఆ తర్వాత కూడా అశ్విన్ మరో వికెట్ తీశాడు. దీంతో 419 వికెట్లతో భారత్ తరఫున టెస్టుల్లో అత్యథిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అవతరించాడు.
అంతేకాదు హర్భజన్ మొత్తం 103 మ్యాచుల్లో 417 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ కేవలం 80 మ్యాచుల్లోనే 419 వికెట్లు కూల్చడం విశేషం. ఈ ఫీట్ సాధించిన అశ్విన్‌ను హర్భజన్ అభినందించాడు. భారత జట్టుకు అశ్విన్ మరిన్ని విజయాలు అందించాలని కోరుకున్నాడు.
Stat Alert – With 418 wickets, @ashwinravi99 becomes India's third-highest wicket-taker in Tests.#TeamIndia pic.twitter.com/TRvelxZ1Wk
— BCCI (@BCCI) November 29, 2021