మెల్బోర్న్: ఆస్ట్రేలియా, పాకిస్థాన్(Australia vs Pakistan) మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మూడో రోజు భోజన విరామ సమయం తర్వాత గమ్మత్తు ఘటన జరిగింది. మెల్బోర్న్ మైదానంలోకి లంచ్ తర్వాత ప్లేయర్లు, ఆన్ ఫీల్డ్ అంపైర్లు వచ్చేశారు. కానీ మ్యాచ్‌ను ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కపోవడం వల్ల మ్యాచ్‌ను ఆపేశారు. అనుకన్న సమయంలో అతను తన చైర్‌లోకి రాలేకపోయాడు. అయితే ఎందుకు మ్యాచ్‌ను ఆపారన్న విషయం గ్రౌండ్లో ఉన్న ఫీల్డర్లుకు అర్థం కాలేదు. అయితే ఆన్‌ఫీల్డ్ అంపైర్లు .. థార్డ్ అంపైర్గురించి చెప్పడంతో ఫీల్డర్లకు సిచువేషన్ అర్థమైంది. అంపైర్ ఇల్లింగ్‌వర్త్ తన పొజిషన్ తీసుకున్న తర్వాత మ్యాచ్‌ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 76 రన్స్ చేసింది. ఆసీస్ ఇప్పటి వరకు 130 రన్స్ లీడ్‌లో ఉంది.
The game is delayed because the third umpire … is stuck in the lift #AUSvPAK pic.twitter.com/eSuKyPQp56
— cricket.com.au (@cricketcomau) December 28, 2023