Rinku Singh: 15 ఏళ్ల క్రితం నాటి ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రింకూ సింగ్
Rinku Singh: లక్నోతో మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ 51 బంతుల్లో 83 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఆరవ నెంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన రింకూ సింగ్ ఐపీఎల్ చరిత్రలోనే ఆ పొజిషన్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
లక్నో: లక్నో సూపర్ గెయింట్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో.. కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. తొలుత ఆ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై కాగా, ఆ తర్వాత సూపర్ ఓవర్లో కోల్‌కతా మెరిసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్(Rinku Singh) అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో అతను ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ 51 బంతుల్లో 83 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఆరవ నెంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన రింకూ సింగ్ చాలా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రన్స్ చేసిన ఆరో నెంబర్ బ్యాటర్‌గా రింకూ నిలిచాడు. గతంలో చెన్నై ప్లేయర్ ఎంఎస్ ధోనీ పేరిట ఆ రికార్డు ఉన్నది. 2011 ఐపీఎల్ సీజన్లో ధోనీ ఆర్సబీతో మ్యాచ్‌లో ఆరో నెంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగి 40 బంతుల్లో 70 రన్స్ స్కోరు చేశాడు. ఇప్పుడు అత్యధిక రన్స్ స్కోరు చేసిన ఆరో నెంబర్ బ్యాటర్‌గా రింకూ హిస్టరీ క్రియేట్ చేయడం విశేషం.
ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య లక్నోలో జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్ అభిమానులను అలరించింది. ఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో ఈ సీజన్లో జరిగిన తొలి సూపర్ ఓవర్లో కోల్‌కతానే విజయం వరించింది. కేకేఆర్ నిర్దేశించిన 156 పరుగుల స్వల్ప ఛేదనలో లక్నో సైతం నిర్ణీత ఓవర్లలో అంతే స్కోరు (155/8) చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో లక్నో.. నరైన్ మాయ చేయడంతో ఒక్కటంటే ఒక్కటే పరుగు చేసింది. రింకూ తొలి బంతికే ఫోర్ బాది కోల్‌కతాకు రెండో విజయాన్ని అందించాడు. మొదట మోహ్సిన్ ఖాన్ (5/23) పేస్‌కు దాసోహమైన కేకేఆర్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది. ప్రధాన బ్యాటర్లంతా నిరాశపరిచినా లోయరార్డర్లో రింకూ సింగ్ (51 బంతుల్లో 83 నాటౌట్, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) పోరాడి ఆ జట్టును పోటీలో నిలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- IPL record
- KKR
- ms dhoni
- Rinku Singh
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

