హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఐస్ హాకీ టోర్నీలో బరిలోకి దిగే రాష్ట్ర జట్టుకు ఆర్యన్ కర్రా ఎంపికయ్యాడు. ఈ మేరకు తెలంగాణ ఐస్ హాకీ అసోసియేషన్ గురువారం రాష్ట్ర జట్టును ప్రకటించింది. ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు జరిగే రాష్ట్ర జట్టు సన్నాహక క్యాంప్‌లో ఆర్యన్ పాల్గొంటాడని అసోసియేషన్ పేర్కొంది.
ఇప్పటికే ఐస్ హాకీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్యన్ జట్టు విజయాల్లో కీలకమయ్యే అవకాశముంది. వచ్చే నెల 1 నుంచి 8వ తేదీ వరకు జాతీయ ఐస్ హాకీ చాంపియన్‌షిప్ జరుగనున్నది.