దుబాయ్: టీమ్ఇండియా యువ పేసర్ అర్ష్‌దీప్‌సింగ్..ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకొచ్చాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అర్ష్‌దీప్ 642 పాయింట్లతో 8వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా ఎనిమిది ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని అర్ష్‌దీప్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్నాడు.