Uppal Stadium | ఉప్పల్ స్టేడియం రికార్డులకు అడ్డాగా మారిందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు అన్నారు. శనివారం బంగ్లాతో మ్యాచ్‌లో భాగంగా టీ20లలో అత్యధిక స్కోరు (297) నమోదుచేసిన గ్రౌండ్‌గా ఉప్పల్ పేరు క్రికెట్ చరిత్ర పుస్తకాల్లో నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
మ్యాచ్‌ను విజయవంతం చేసేందుకు గాను గత పది రోజులుగా అహర్నిశలు శ్రమించిన హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు, క్లబ్ సెక్రటరీలు, ఇతర సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిరీస్ గెలిచిన భారత సారథి సూర్యకు జగన్మోహన్ రావు విజేత ట్రోఫీని బహూకరించారు.