లాహోర్: పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా జావెలిన్ త్రోలో రికార్డు త్రో విసిరి స్వర్ణం గెలిచిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ వివాదంలో చిక్కుకున్నాడు. పసిడి గెలిచి స్వదేశానికి తిరిగొచ్చిన అతడిని నిషేధిత తీవ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా నాయకుడు హరీస్ ధార్ కలవడం వివాదాస్పదమైంది. నదీమ్ ఇంటికి వెళ్లిన హరీస్.. అతడి భుజంపై చేయి వేసి మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో ఎప్పటిదనేదానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉండగా స్వర్ణం గెలిచిన నదీమ్‌పై నజరానాలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్ ప్రావిన్సు చీఫ్ మినిస్టర్ మర్యమ్ నవాజ్ అతడికి పాకిస్థాన్ పది మిలియన్ రూపాయలతో పాటు హోండా కారును అందజేశారు. కారుకు 92.97 నంబర్ కేటాయించడం విశేషం. ఒలింపిక్స్‌లో నదీమ్ విసిరిన త్రో ఇదే కావడం గమనార్హం.