హైదరాబాద్, ఆట ప్రతినిధి: చిత్రకూట్(మహారాష్ట్ర) వేదికగా జరిగిన సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ర్టానికి చెందిన మహమ్మద్ అర్షద్ కాంస్య పతకంతో మెరిశాడు. బాలుర అండర్-11 విభాగం టేబుల్ వాల్ట్‌లో పోటీకి దిగిన అర్షద్ 9.90 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకున్నాడు.
అనుభవ్‌సింగ్(10.60), దేవాంశ్ మెహత్రె(10.05) వరుసగా స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు. గత నాలుగేండ్ల నుంచి హేమంత్ జిమ్నాస్టిక్స్ అండ్ ఫిటెన్స్ అకాడమీలో అర్షద్ శిక్షణ పొందుతున్నాడు.