బెంగళూరు: భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తన సొంత కంపెనీ సెంటారస్ లైఫ్‌స్టయిల్ బ్రాం డ్లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధుల విషయంలో మోసానికి పాల్పడినట్లు తేలడంతో బెంగళూరు రిజీనల్ పీఎఫ్ కమిషనర్ గోపాలరెడ్డి..పులకేశి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తనకు చెందిన వస్త్ర కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్ కింద రూ.23,36,602 మొత్తం ఉతప్ప బకాయి పడ్డట్లు తేలింది. ఈ కారణంగా పీఎఫ్, మిసిలీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 కింద ఈ మాజీ క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్ నమోదైంది. అయితే ఉతప్ప ప్రస్తుతం బెంగళూరులో ఉండటం లేదని దుబాయ్‌లో కుటుంబంతో నివసిస్తున్నట్లు తెలిసింది.