ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెండ్లి బాజాలు మోగనున్నాయి. అతడి తనయుడు అర్జున్.. ప్రముఖ వ్యాపారవేత్త రవిఘా య్ వారసురాలు సానియా ఛందోక్ వివాహం మార్చి 5న జరుగనున్నట్టు సమాచారం.
నిరుడు ఆగస్టులో ముం బైలోని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వీరిద్దరి నిశ్చితార్థమవగా పెండ్లిని మాత్రం అతిరథ మహారథుల సమక్షంలో నిర్వహించనున్నట్టు వినికిడి.