చెన్నై: భారత నంబర్ వన్ ఆటగాడు, తెలంగాణ కుర్రాడు ఇరిగేశి అర్జున్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. టైటిల్‌పై ఆశలు రేపిన అర్జున్ బుధవారం జరిగిన చివరి, ఏడో రౌండ్లో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలీరెజా ఫిరౌజాతో గేమ్‌ను 41 ఎత్తుల తర్వాత డ్రా చేసుకున్నాడు.
దాంతో ఫిరౌజా 4.5 పాయింట్లతో టైటిల్ నెగ్గగా.. అర్జున్, రష్యా జీఎం దిమిత్రి ఆండ్రీకిన్ చెరో 4 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఆండ్రీకిన్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా.. అర్జున్ సెకండ్ రన్నరప్‌తో సరిపెట్టాడు. వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ ఏడు రౌండ్లలో రెండు పాయింట్లు మాత్రమే నెగ్గి చివరి స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచాడు.