హైదరాబాద్, ఆట ప్రతినిధి: మారుతూ ఉండే ర్యాంకింగ్స్, ఎలో రేటింగ్స్ గురించి పెద్దగా పట్టించుకోనని భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ అన్నాడు. ఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత స్వర్ణ చరిత్రలో కీలకంగా వ్యవహరించిన అర్జున్‌తో పాటు హరికృష్ణ, హారిక, శ్రీనాథ్, వంతికా అగర్వాల్‌ను మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ ‘2800 ఎలో రేటింగ్ చేరుకోవడం చాలా గర్వంగా ఉంది. భవిష్యత్‌లో ప్రపంచ చాంపియన్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. రాబోయే మెగాటోర్నీలో గుకేశ్‌కు 80 నుంచి 90 శాతం వరకు టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి’ అని అన్నాడు. ప్రవాహ, మైత్రా, ఎంజీడీ1 సంస్థలు చెస్ ప్లేయర్లను సన్మానించాయి.