Freestyle Grand Slam : ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగేసి (Arjun Erigaisi) విశ్వ వేదికపై మరోసారి తన తడాఖా చూపించాడు. ప్రతిష్ఠాత్మక ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ (Freestyle Grand Slam) టూర్లో అదరగొడుతున్న అతడు దర్జాగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. లాస్ వేగాస్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో ఉజ్బెకిస్థాన్ స్టార్ నొద్రిబెక్ అబ్దుసత్రోవ్ను తెలంగాణ కుర్రాడు చిత్తు చేశాడు. అయితే.. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి రెట్టించిన ఉత్సాహంతో క్వార్టర్స్ చేరిన ప్రజ్ఞానంద (R Praggnanandhaa) మాత్రం అనూహ్యంగా టైటిల్ రేసులో వెనకబడ్డాడు.
తన సూపర్ ఆటతో అందర్నీ అబ్బురపరుస్తున్న అర్జున్.. ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్లోనూ మెరిశాడు. నొద్రిబెక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ 1.5-0.5తో గెలుపొందాడు. తన వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రత్యర్థిని మట్టికరిపించి సెమీస్‌లో అడుగుపెట్టి టైటిల్ వేటకు అడుగు దూరంలో నిలిచాడు.
🤯 SHOCKWAVE IN VEGAS!
Day 1 of the Las Vegas Freestyle Chess Grand Slam saw Magnus Carlsen eliminated in the group stage!
An absolute stunner! The tour just got even more unpredictable. #FreestyleChess
📷 Lennart Ootes/Freestyle Chess. pic.twitter.com/dYCXcBSdNH
— Chess For Sharks (@ChessForSharks) July 17, 2025
గత మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen)కు ముచ్చెమటలు పట్టించిన ప్రజ్ఞానంద సెమీస్ బెర్తు సాధించలేకపోయాడు. క్వార్టర్స్‌లో అతడు కరౌనా చేతిలో 3-4తో పరాజయం చెందాడు. దాంతో, టైటిల్ రేసు నుంచి వైదొలిగాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్లు లెవొన్ అరొనియన్, హన్స్ మొకే నీమన్లు సెమీస్‌లో బరిలో నిలిచారు.