TDP Leader Resigns | టీడీపీకి సీనియర్ నేత రాజీనామా.. భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి
TDP Leader Resigns | గోవా గవర్నర్‌గా నియమితులైన టీడీపీ సీనియర్ నేత , కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పార్టీకి రాజీనామా చేశారు.
అమరావతి : గోవా గవర్నర్‌గా నియమితులైన టీడీపీ( TDP) సీనియర్ నేత , కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు( Ashok Gajapati Raju) పార్టీకి రాజీనామా ( Resigns ) చేశారు. విజయనగరం జిల్లా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు . ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపక సభ్యుల్లో ఒకరైన పూసపాటి అశోక్ గజపతిరాజు తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పంపించారు. టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరోకు కూడా రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పార్టీతో పాటు ప్రజలు, దేశానికి సేవ చేసేందుకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ లేఖ కాపీని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని లేఖల్లో అధిష్టానాన్ని కోరారు.
ఇటీవల దేశంలో మూడు రాష్ట్రాలకు ముగ్గురు గవర్నర్ల నియామకంలో అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా కేంద్రం నియమించింది. ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీకి తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉండడంతో శుక్రవారం తన రాజీనామాను అధికారికంగా సమర్పించారు. 43 ఏళ్ల పాటు టీడీపీలోనే కొనసాగిన ఆయన 2004లో మినహా వరుసగా విజయనగరం ఎమ్మెల్యే, ఎంపీగా గెలుస్తూ వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా కొనసాగారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

