పారిస్: పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో భారత్ షూటర్ అర్జున్ బబుటా(Arjun Babuta) పతకాన్ని మిస్ చేసుకన్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పతకాన్ని గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడు. ఫైనల్లో తొలి రౌండ్ నుంచి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన అతను చివరలో తడబడ్డాడు. దీంతో అతను 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అతను నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్లో అర్జున్ 208.4 పాయింట్లు స్కోర్ చేశాడు. ఒక్క పొజిషన్ తేడాతో అతను మెడల్‌ను చేజార్చుకున్నాడు. 5 షాట్ సిరీస్‌లో 52 పాయింట్లతో మంచి స్టార్ట్ ఇచ్చిన అర్జున్.. ఆ తర్వాత క్రమంగా తన పొజిషన్ పోగొట్టుకున్నాడు. 10 షాట్స్ పొజిషన్లో మూడవ స్థానంలో ఉన్న అతను.. ఆ తర్వాత తేరుకోలేకపోయాడు.
BREAKING: MASSIVE HEARTBREAK for ARJUN 💔
Arjun finishes 4th in FINAL of 10m Air Rifle event. #Paris2024 #Paris2024withIAS pic.twitter.com/R6sWGWCrZL
— India_AllSports (@India_AllSports) July 29, 2024