మునిచ్: యూరో కప్‌లో టైటిల్ ఫేవరేట్లుగా ఉన్న ఫ్రాన్స్‌కు తొలి సెమీస్‌లో స్పెయిన్ ఊహించని షాకిచ్చింది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో అసలు ఓటమన్నదే లేకుండా సెమీస్ చేరిన స్పెయిన్.. 2-1తో ఫ్రాన్స్‌ను చిత్తుచేసి 12 ఏండ్ల (2012లో చివరిసారి) తర్వాత యూరో కప్ ఫైనల్‌కు చేరింది. ఆట మొదలయ్యాక 9వ నిమిషంలోనే ఫ్రాన్స్ కోలో మువానీ తొలి గోల్ కొట్టి ఆ జట్టును ఆధిక్యంలోకి తెచ్చాడు. కానీ స్పెయిన్ తరఫున 16 ఏండ్ల కుర్రాడు లమీన్ యమాల్ 21వ నిమిషంలో గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. యమాల్ కొట్టిన ఈ గోల్‌తో అతడు ఈ టోర్నీలో అత్యంత పిన్నవయసులో గోల్ చేసిన ఫుట్‌బాలర్‌గా రికార్డులకెక్కాడు. అదే ఊపులో స్పెయిన్‌కు 25వ నిమిషంలో డానీ ఒల్మొ గోల్ చేశాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ ఎంత ప్రయత్నించినా స్పెయిన్ గోల్ చేసే అవకాశమివ్వలేదు. నెదర్లాండ్స్-ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీస్‌లో విజేతతో స్పెయిన్ టైటిల్ పోరులో తలపడనుంది.

యూరో కప్‌తో సమాంతరంగా జరుగుతున్న కోపా అమెరికా టోర్నీలో అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి సెమీస్‌లో అర్జెంటీనా 2-0తో కెనడాను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆ జట్టు తరఫున జులియన్ (22వ నిమిషంలో), లియోనల్ మెస్సీ (51వ నిమిషంలో) తలా ఓ గోల్ చేశారు.