Argentina: వివాదాస్పద బ్యానర్ ప్రదర్శించిన అర్జెంటీనా ప్లేయర్లు.. చర్యలు తీసుకోనున్న ఫిఫా
Argentina: ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ప్లేయర్లు వివాదాస్ప రీతిలో బ్యానర్లు ప్రదర్శించారు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత అర్జెంటీనా ఆటగాళ్లు సంబరాలు జరుపుకున్నారు. ఆ సమయంలో ఫాక్‌ల్యాండ్స్ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ ఘటన పట్ల ఫిఫా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
అట్లాంటా: ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్లు వివాదాస్ప రీతిలో బ్యానర్లు ప్రదర్శించారు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత అర్జెంటీనా ఆటగాళ్లు సంబరాలు జరుపుకున్నారు. అయితే మైదానంలోనే ఆ ప్లేయర్లు ఓ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఫాక్‌ల్యాండ్స్‌కు మద్దతు ఇచ్చే రీతిలో ఉన్న బ్యానర్‌ను ఆటగాళ్లు పట్టుకున్నారు. దీనిపై వివాదం చెలరేగింది. లాస్ మాల్వినాస్ సన్ అర్జెంటీనాస్ అని బ్యానర్లో రాసింది. అర్జెంటీనాకే ఫాక్‌ల్యాండ్స్ చెందుతాయన్న అర్థం వచ్చే రీతిలో బ్యానర్ ఉన్నది. అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఫాక్‌ల్యాండ్స్ దీవులు ఒకప్పుడు బ్రిటన్ ఆధీనంలో ఉన్నాయి. అయితే ఆ దీవులు తమకే చెందుతాయని అర్జెంటీనా పోరాడుతోంది.
ఈ నేపథ్యంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్లు .. బ్యానర్లు ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. ఫుట్‌బాల్ ప్లేయర్లు రాజకీయ సంకేతాలు ఇవ్వడం సరికాదు అని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 1982లో ఈ రెండు దేశాల మధ్య ఆ దీవుల కోసం యుద్ధం కూడా జరిగింది. ఆ యుద్ధంలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2014లో అర్జెంటీనా ప్లేయర్లు ఇలాగే ఓ వివాదాస్పద బ్యానర్‌ను ప్రదర్శించారు. అప్పుడు ఆ జట్టుకు 20 వేల పౌండ్లు జరిమానా వేశారు. అయితే తాజాగా జరిగిన ఘటన పట్ల దర్యాప్తు చేపట్టనున్నట్లు ఫిఫా అధికారులు చెబుతున్నారు. ఆటగాళ్లు నియమావళిని ఉల్లంఘించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
#WATCH : Argentina’s post-match celebrations after defeating England have sparked controversy after players unfurled a banner claiming the Falkland Islands belong to Argentina. FIFA bans political demonstrations at its tournaments and is expected to review the incident.… pic.twitter.com/KebQQoDXPh
— upuknews (@upuknews1) July 16, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

