Arctic Open ఫిన్లాండ్: పారిస్ ఒలింపిక్స్ తర్వాత కొద్దిరోజులు విరామం తీసుకున్న భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్ తిరిగి బ్యాడ్మింటన్ కోర్టులో అడుగు పెట్టనున్నారు. మం గళవారం (అక్టోబర్ 8) నుంచి ఫిన్లాండ్లోని వాంటా వేదికగా జరిగే ఆర్క్టిక్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో ఈ ఇద్దరూ పునరాగమనం చేయనున్నారు. కొత్త కోచ్‌లు అనూప్ శ్రీధర్, కొరియా దిగ్గజం లి స్యూన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న సింధు.. తొలి రౌండ్లో కెన డా అమ్మాయి మిచెల్లె లి తో తలపడనుంది. మరోవైపు సేన్ గతేడాది ఇండియా ఓపెన్‌లో తనను ఓడించిన రస్మస్ జెమ్కె (డెన్మార్క్)ను ఢీకొననున్నాడు. ఈ ఇద్దరితో పాటు కిడాంబి శ్రీకాంత్, మాళవిక బన్సో ద్, ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్ వంటి స్టార్ షట్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
లంక చీఫ్ కోచ్‌గా జయసూర్య
కొలంబో: శ్రీలంక దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య ఆ జట్టుకు ఫుల్ టై మ్ హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు. గత జూలై నుంచి ఆ జట్టుకు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న జయసూర్యకు రెండేండ్ల పాటు (2026 టీ20 వరల్డ్ కప్ దాకా) పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగిస్తున్నట్టు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) నిర్ణయం తీసుకుంది. జయసూర్య కోచింగ్‌లో లంక.. ఈ ఏడాది ఆగస్టులో భారత్‌ను వన్డేలలో ఓడించడమే గాక ఇటీవలే న్యూజిలాండ్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌నూ క్లీన్‌స్వీప్ చేసింది.
తెలంగాణకు కాంస్యం
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సై ఫాబాద్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ వేదికగా జరిగిన 34వ జాతీయ జూనియర్ త్రోబాల్ టోర్నీలో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు ద క్కాయి. సోమవారం జరిగిన బాలిక ల సెమీఫైనల్లో తెలంగాణ 13-15, 9-15తో ఢిల్లీ చేతిలో ఓడింది. మరోవైపు బాలుర సెమీస్‌లో తెలంగాణ 12-15, 13-15తో ఢిల్లీపై పరాజ యం పాలైంది. ఢిల్లీ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.