న్యూఢిల్లీ: భారత ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం(Jyothi Surekha) .. వరల్డ్‌కప్ ఫైనల్ల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. మహిళల కాంపౌండ్ ఆర్చరీలో పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. ఏషియన్ గేమ్స్ చాంపియన్ అయిన జ్యోతి సురేఖ.. వరల్డ్‌కప్‌లో వరల్డ్ నెంబర్ 2 ప్లేయర్ ఎల్లా గిబ్సన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నది. కానీ ఆ బ్రిటన్ ప్లేయర్‌ను ఖంగుతినిపించింది. 15 పర్ఫెక్ట్ షూట్స్‌తో 150-145 స్కోరు సాధించిందామె.
నాన్జింగ్లో జరిగిన వరల్డ్ కప్ సీజన్ ఫైనల్లో 29 ఏళ్ల భారతీయ షూటర్ 143-14- స్కోరుతో క్వార్టర్స్‌లో అలెక్సిస్ రుయిజ్పై గెలుపొందింది. సెమీఫైనల్లో తీవ్ర పోరాటం చేసింది జ్యోతి. వరల్డ్ నెంబర్ వన్ ఆండ్రియా బెకరా చేతిలో 143-145 స్కోరుతో ఓటమి పాలైంది. మూడవ రౌండ్లో ఓ దశలో జ్యోతి(87-86) ఒక్క పాయింట్ తేడాతో లీడింగ్‌లో ఉన్నది.
కానీ ఫోర్త్ ఎండ్‌లో బెకరా వరుసగా మూడు 10 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత 116-115 స్కోరుతో లీడింగ్‌లోకి వెళ్లింది. ఇక ఫిఫ్త్ ఎండ్‌లో 29-28 స్కోరుతో బెకర దూసుకెళ్లింది.
History made, again! 🏹🥉#TeamIIS archer Jyothi Surekha Vennam clinches bronze at the Archery World Cup Final in Nanjing, becoming the first Indian woman compound archer to medal at the event!
Her flawless 150/150 score – the first-ever in a World Cup Final, sets a new… pic.twitter.com/0FeZ0F8c7Z
— Inspire Institute of Sport (@IIS_Vijayanagar) October 18, 2025