మకావు: భారత ఉషు క్రీడాకారిణి అపర్ణ సాండా ప్రపంచకప్లో స్వర్ణ పతకంతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల 52 కేజీల విభాగం ఫైనల్లో అపర్ణ వరుస సెట్లలో డిఫెండింగ్ వరల్డ్ చాంప్, వియత్నాంకు చెందిన తి పువాంగ్ ఎన్గాను ఓడించి నయా చాంపియన్గా నిలిచింది.
గతే సెప్టెంబర్లో ప్రపంచ ఉషు చాంపియన్షిప్ తుదిపోరులో ఇదే ప్రత్యర్థి చేతిలో ఎదురైన ఓటమికి అపర్ణ ప్రతీకారం తీర్చుకుంది. ఉషు క్రీడలో ప్రధానంగా తావ్లూ, సాండా అనే రెండు విభాగాలు ఉంటాయి.