హైదరాబాద్: క్రికెట్ విరాట్ కోహ్లీ ఇవాళ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో భార్య అనుస్కా శర్మ కొన్ని ఫోటోలను తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేసింది. ఫన్నీగా ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ ఫోటోలను బాలీవుడ్ బ్యూటీ అనుష్కా తన ఇన్స్టాలో పోస్టు చేసింది. నవ్వులు పూయిస్తున్న ఆ ఫోటోల్లో కోహ్లీ చిన్నపిల్లాడిలా తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఆ ఫోటోలకు అనుష్కా ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. మై లవ్, ఇవాళ నీ పుట్టిన రోజు, అందుకే కొన్ని ఫోటోలను పోస్టు చేస్తున్నానని, చాలా ఫన్నీగా ఉండే ఫోటోలు ఉన్నాయని, నువ్వు ఎలా ఉన్నా.. దాన్ని ఆస్వాదిస్తానంటూ అనుష్కా కామెంట్ చేశారు.
ఇక కామెంట్ సెక్షన్లో విరాట్ స్పందించాడు. ఎర్ర రంగులోని హార్ట్ ఎమోజీలను కొన్ని పోస్టు చేశాడు. మరో క్రికెటర్ డివిలీర్స్ కూడా ఆ పోస్టుపై రియాక్ట్ అయ్యాడు. ఆ ఫేస్ చూడాల్సిందే అంటూ కొన్ని లాఫింగ్ ఎమోజీలను పోస్టు చేశాడు. హ్యాపీ బర్త్డే కింగ్ అంటూ ఓ అభిమాని పోస్టు చేశాడు.
2017 డిసెంబర్లో కోహ్లీ, అనుష్కా పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరికీ వామికా కోహ్లీ 2021లో జన్మించింది.