పెద్దమందడి, మార్చి 25 : జాతీయస్థాయి కబడ్డీ జట్టు కెప్టెన్‌గా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పిల్లిగుండ్లతండాకు చెందిన పేద విద్యార్థిని ఇస్లావత్ అనూష ఎంపికైంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇస్లావత్ రెడ్యానాయక్, జ్యోతి దంపతుల కూతురు మహబూబ్‌నగర్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది.
కబడ్డీలో ప్రావీణ్యం చూపడంతో జాతీయ స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైంది. దీంతో గ్రామస్థులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.