న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు.. ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీలోని మేజర్ థ్యాన్ చంద్ స్టేడియంలో ఆ మ్యాచ్ జరిగింది. 2025 నాటికి టీబీ విముక్తి భారత్ లక్ష్యంతో ఆ మ్యాచ్‌ను నిర్వహించారు. 20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లోక్‌సభ స్పీకర్ లెవన్ జట్టు భారీ స్కోర్ చేసింది. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur).. 111 రన్స్ స్కోర్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు 73 రన్స్ తేడాతో నెగ్గింది.
Century by Himachal ka Chokra @ianuragthakur 🔥 Did you know Anurag Thakur was part of the Ranji team before heading the BCCI? One of the most multi-talented politicians out there—shining both on the cricket field and in politics. #HimachalPradesh
— Nikhil saini (@iNikhilsaini) December 15, 2024
అయితే అనురాగ్ ఠాకూర్ సిక్సర్‌తో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాఘవ్ చద్దా బౌలింగ్‌లో అతను సిక్సర్ కొట్టి వంద మైలురాయి అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైలర్ అవుతున్నది. కెప్టెన్ అనురాగ్ ఠాకూర్ 59 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. లోక్‌సభ స్పీకర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసిన 250 రన్స్ స్కోర్ చేసింది. అయితే చైర్మెన్ లెవన్ జట్టు ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఆ జట్టు కేవలం 178 రన్స్ మాత్రమే చేసింది. దాంట్లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అత్యధికంగా 74 రన్స్ చేశాడు. అనురాగ్ ఠాకూర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.