Antim Panghal: అంతిమ్ పంగల్కు ప్రతిష్టాత్మక అవార్డు..
Antim Panghal: 19 ఏండ్ల అంతిమ్.. గత రెండేండ్లుగా అద్భుత విజయాలతో వరుస టోర్నీలలో పతకాలు కొల్లగొడుతున్నది. ఆమె వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగబోయే పారిస్ ఒలింపిక్స్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతుండగా...
Antim Panghal: భారత రెజ్లింగ్ యువ సంచలనం అంతిమ్ పంగల్కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2023 సంవత్సరానికి గాను అంతిమ్.. ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఈయర్ ’ అవార్డును సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక యూనైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఈ అవార్డును అందజేసింది. 19 ఏండ్ల అంతిమ్.. గత రెండేండ్లుగా అద్భుత విజయాలతో వరుస టోర్నీలలో పతకాలు కొల్లగొడుతున్నది. ఆమె వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగబోయే పారిస్ ఒలింపిక్స్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతుండగా ఈ అవార్డు దక్కడం ఈ యువ బాక్సర్ ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంపొందించేదే.
గతేడాది అండర్ 20 వరల్డ్ ఛాంపియన్షిప్ లో అంతిమ్ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ఛాంపియన్గా నిలిచింది. 2020లో 17 ఏండ్ల వయసులోనే అంతిమ్.. జూనియర్ ఆసియన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గింది. అండర్ – 23 ఆసియన్ ఛాంపియన్షిప్స్లో రెండో స్థానం దక్కించుకుంది. ఇక కొద్దిరోజుల క్రితమే హాంగ్జౌ వేదికగా ముగిసిన ఆసియా క్రీడలలో కాంస్యం గెలిచింది. ఈ ఏడాది వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కాంస్యం నెగ్గడంతో ఆమె పారిస్ ఒలింపిక్స్లో బెర్త్ ఖాయం చేసుకుంది.
🤼♀️ ANTIM PANGHAL WINS WOMEN’S RISING STAR OF THE YEAR AWARD
Antim Panghal with a stellar 2023 season wins UWW Rising Star of the Year Award.
Antim’s achievement in 2023:
Asian Championships 🥈
U20 World C’ships 🥇
Senior World C’ships 🥉
Asian Games 🥉 pic.twitter.com/xDW9W06cB5— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) December 13, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

