Anshul Kamboj | లాహిల్(హర్యానా): సుదీర్ఘ రంజీ ట్రోఫీ చరిత్రలో హర్యానా యువ పేసర్ అన్శుల్ కంబోజ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు పడగొట్టిన అన్శుల్ ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గ్రూపు-సీలో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్ లో అన్శుల్ ఈ ఫీట్ అందుకున్నాడు.
30.1 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన అన్శుల్ 49 పరుగులిచ్చుకుని 10 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో విజృంభిస్తూ కేరళ బ్యాటరల పనిపట్టాడు. అన్శుల్ ధాటికి కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. అక్షయ్ చంద్రన్ (59) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు రంజీల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన వారిలో ప్రేమాంగ్శు (బెంగాల్), ప్రదీప్సుదరమ్ (రాజస్థాన్) అన్శుల్ కంటే ముందు ఉన్నారు.