మాంచెస్టర్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగవ టెస్టులో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో ఈ మ్యాచ్ కోసం మూడు మార్పులు చేశారు. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్‌ను తీసుకున్నారు. నితీశ్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్ స్థానంలో అన్షుల్ కాంబోజ్(Anshul Kamboj)కు చోటు కల్పించారు. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నాడు. అయితే టెస్టుల్లో కాంబోజ్ అరంగేట్రం చేయనున్నాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన కాంబోజ్.. దేశవాళీ క్రికెట్లో హర్యానాకు ఆడుతాడు. అయితే ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలో.. కేరళతో జరిగిన మ్యాచ్‌లో అతను ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేశాడు.
భారత్ తరపున టెస్టు క్రికెట్ ఆడుతున్న 318వ క్రికెటర్‌గా కాంబోజ్ నిలిచాడు. అతను 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. వాటిల్లో 79 వికెట్లను తీసుకున్నాడు. ఇండియా ఏ తరపున అతను చివరి మ్యాచ్ ఆడాడు. నార్తంప్టన్‌లో ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో ఆ మ్యాచ్ జరిగింది. దాంట్లో అతను రెండు ఇన్నింగ్స్‌లో రెండేసి వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్‌లో 51 రన్స్ చేశాడు. ఆ మ్యాచ్ డ్రా అయ్యింది.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున కాంబోజ్ ఆడుతాడు. సీఎస్కే తరపున ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు తీసుకున్నాడతను. ఐపీఎల్ 2024లో ముంబై అతను అతను మూడు మ్యాచ్‌లు ఆడాడు. వాటిల్లో రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుత టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
Test Cap number 3⃣1⃣8⃣ 🙌
Congratulations to Anshul Kamboj, who is all set to make his international Debut! 👏👏
Updates ▶️ https://t.co/L1EVgGu4SI#TeamIndia | #ENGvIND pic.twitter.com/ntZRqsxczF
— BCCI (@BCCI) July 23, 2025