IPL 2025 : చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను తక్కువకే కట్టడి చేసిన సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్. పవర్ ప్లేలోనే ఓపెనర్లు పెవిలియన్ చేరారు. దంచికొడుతున్న ఓపెనర్ ట్రావిస్ హెడ్(19)ను అన్షుల్ కంబోజ్ బౌల్డ్ చేశాడు. అతడు వేసిన ఆరో ఓవర్ నాలుగో బంతికి హెడ్ పెద్ద షాట్ ఆడబోయాడు.
కానీ, బంతి లెగ్ స్టంప్‌ను ఎగరగొట్టింది. దాంతో, 37వద్ద హైదరాబాద్ రెండో వికెట్ పడింది. ప్రస్తుతం ఇషాన్ కిషన్(17), హెన్రిచ్ క్లాసెన్‌లు క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు స్కోర్.. 37- 2. ఇంకా సన్‌రైజర్స్ విజయానికి 84 బంతుల్లో 118 రన్స్ కావాలి. అంటే.. ఓవర్‌కు 8కి పైగా రన్స్ రావాలి.
Comeback 🔛#CSK get the big wickets of Abhishek Sharma and Travis Head in the powerplay ☝☝#SRH 37/2 after 6 overs.
Scorecard ▶ https://t.co/26D3UalRQi#TATAIPL | #CSKvSRH | @ChennaiIPL pic.twitter.com/5hiTB7HUDX
— IndianPremierLeague (@IPL) April 25, 2025
స్వల్ప ఛేదనలో సన్‌రైజర్స్‌కు సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ పెద్ద షాకిచ్చాడు. రెండో బంతికే ఓపెనర్ అభిషేక్ శర్మ(0)ను ఔట్ చేశాడు. అభి ఆడిన బంతిని అన్షుల్ కంబోజ్ సులువుగా అందుకున్నాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ జతగా హెడ్ ధాటిగా ఆడాడు. ఇద్దరూ బౌండరీలతో చెలరేగారు.