లండన్: మహిళల క్రికెట్లో ఆడేందుకు తనకు అనుమతి ఇవ్వాలని అనయ బంగర్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హర్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ(హెచ్ఆర్టీ) నివేదికను పొందుపరుస్తూ ఎనిమిది పేజీలతో కూడిన లేఖను ఐసీసీతో పాటు బీసీసీఐకి పంపింది. ట్రాన్స్జెండర్లకు మద్దతుగా నిలువాల్సిందిగా అనయ సోషల్మీడియాలో పోస్ట్ చేసిన తన లేఖలో ప్రముఖంగా ప్రస్తావించింది. 2021లో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన 24 ఏండ్ల అనయ మాట్లాడుతూ ‘జాతీయ జట్టుకు తిరిగి ఆడాలనుకుంటున్నాను. దేశానికి ఆడాలన్న తపన నాలో అప్పుడు ఎలా ఏందో ఇప్పటికీ అలాగే ఉంది. కలను సాకారం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఏదో ఒక రోజు తండ్రి సంజయ్ బంగర్ నాకు మద్దతుగా నిలుస్తాడన్న నమ్మకం నాకుంది’ అని లేఖలో పేర్కొంది. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో క్రికెట్లో ట్రాన్స్జెండర్ల ప్రాతినిధ్యంపై ఐసీసీ నిషేధం విధించిన విషయం విదితమే.