ENGW vs NZW : మహిళల ప్రపంచ కప్‌లో ఫేవరెట్‌గా అడుగుపెట్టిన న్యూజిలాండ్ భారీ ఓటమితో టోర్నీని ముగించింది. సెమీస్ బెర్తును నిర్ణయించే కీలక పోరులో టీమిండియా చేతిలో కంగుతిన్న వైట్‌ఫెర్న్స్.. చివరి లీగ్ మ్యాచ్‌లోనూ తడబడింది. ఇంగ్లండ్ స్పిన్నర్లు అమీ జోన్స్(3-30), నాట్ సీవర్ బ్రంట్(2-31) విజృంభణతో 168కే ఆలౌటయ్యింది. స్వల్ప ఛేదనలో అమీ జోన్స్(86 నాటౌట్) అర్ధ శతకంతో మెరవగా.. టమ్మీ బ్యూమంట్ (40) దంచేసింది. వీరిద్దరిచ్చిన శుభారంభాన్ని హీథర్ నైట్(33) కొనసాగించగా.. 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.
చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై ఊహించని ఓటమి నుంచి తేరుకున్న ఆ జట్టు ఆదివారం విశాఖపట్ణణంలో న్యూజిలాండ్ భరతం పట్టింది. అసలే.. భారత జట్టు చేతిలో దారుణ ఓటమితో సెమీస్ అవకాశం చేజార్చుకున్న సోఫీ డెవినే బృందాన్ని మరింత కుంగదీస్తూ సూపర్ విక్టరీ కొట్టింది. తొలుత ఓపెనర్ సుజీ బేట్స్ (10) వికెట్ తీసిన లిన్సే స్మిత్ (3-30 ) కివీస్‌ను ఆదిలోనే దెబ్బకొట్టింది. జార్జియా ప్లిమ్మర్(43), అమేలియా కేర్ (35) రెండో వికెట్‌కు కీలకమైన రన్స్ జోడించి జట్టును ఆదుకున్నారు.
New Zealand are denied a consolation victory in Sophie Devine’s final ODI as England seal second spot in the #CWC25 table with a dominant win
Scorecard: https://t.co/N3BHyuT1aK pic.twitter.com/LePFkWpwpA
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2025
కానీ, చార్లీ డీన్, నాట్ సీవర్ బ్రంట్(2-31), అలిసే క్యాప్సే(2-34)లు వికెట్ల వేట కొనసాగించగా వైట్ ఫెర్న్స్ మిడిలార్డర్ కుప్పకూలింది. 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటయ్యింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు టమ్మీ బ్యూమంట్(40), అమీ జోన్స్(86 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. బౌండరీలతో చెలరేగిన ఈ ద్వయం.. న్యూజిలాండ్ బౌలర్లను వణికిస్తూ తొలి వికెట్‌కు 75 రన్స్ రాబట్టింది. ఈ జోడీని తహుహు విడదీసినా హీథర్ నైట్(33) అండగా.. జోన్స్ రెచ్చిపోయింది. వరుసగా రెండో అర్థ శతకం నమోదు చేసిన తను జట్టుకు 8 వికెట్ల విజయాన్ని కట్టబెట్టింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ బుధవారం జరుగబోయే సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.