IBA Junior World Championships: యువ భారత బాక్సర్ల ఫైనల్ పోరు.. ముగ్గురికి రజతం..
IBA Junior World Championships: ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో భారత యువ బాక్సర్లు సత్తా చాటుతున్నారు. ఇదివరకే ఈ పోటీలలో భారత్ నుంచి 12 మంది బాక్సర్లు తుది పోరుకు అర్హత సాధించగా...
IBA Junior World Championships: అర్మేనియాలోని యెరెవన్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో భారత యువ బాక్సర్లు సత్తా చాటుతున్నారు. ఇదివరకే ఈ పోటీలలో భారత్ నుంచి 12 మంది బాక్సర్లు తుది పోరుకు అర్హత సాధించగా వీరిలో ముగ్గురు రజతాలతో సరిపెట్టుకున్నారు. మరో తొమ్మిది మంది బాక్సర్లు స్వర్ణాల కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. రజతం సాధించినవారిలో అమిషా కెరెట్ట, ప్రాచి టోకొస్, హార్ధిక్ పన్వర్‌లు సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు.
ఆదివారం రాత్రి ముగిసిన ఫైనల్స్‌లో ఆసియన్ జూనియర్ ఛాంపియన్ హార్ధిక్ పన్వర్ (80 కిలోలు).. 2-3 తేడాతో రష్యాకు చెందిన అషురోవ్ చేతిలో ఓడిపోయాడు. 54 కిలోల విభాగంలో పోటీ పడుతున్న అమిషా.. 0-5 తేడాతో కజకిస్తాన్‌కు చెందిన అయిజాన్ సిదిక్ చేతిలో ఓడింది. 80 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ప్రాచి కూడా 0-5 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సొబిరఖోన్ చేతిలో పరాజయం పాలైంది.
Sunday ends well with 2⃣ #Silvers🥈for our Junior girls at #IBA Junior Boys & Girls #Boxing🥊 Championship, 🇦🇲
Amisha & Prachi put a brave fight against 🇰🇿 & 🇺🇿 respectively to settle for🥈
Well fought girls💪🏻! Many congratulations on your Silvers👏 pic.twitter.com/mIlflQmDyN
— SAI Media (@Media_SAI) December 3, 2023
ఈ టోర్నీలో భారత్ ఇంకా పాయల్ (48 కిలోలు), నిషా (52 కిలోలు), విని (57 కిలోలు), సృష్టి (63 కిలోలు), ఆకాన్ష (70 కిలోలు), మేఘ (80 కిలోలు), జతిన్ (54 కిలోలు), సాహిల్ (75 కిలోలు), హేమంత్ (80 కిలోలు)లు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పోటీలలో భారత్ వివిధ విభాగాలలో ఇదివరకే 17 పతకాలు ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

