మాడ్రిడ్: స్పెయిన్ యువ కెరటం కార్లస్ అల్కరాజ్ సంచలనం సృష్టించాడు. దిగ్గజ ప్లేయర్లు రఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్‌లను ఓడించి సంచలనం రేపిన అల్కరాజ్.. మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ 6-1, 6-1తో డిఫెండింగ్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను చిత్తు చేశాడు. స్పెయిన్ వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి పోరులో జ్వెరెవ్‌పై ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. వరుసగా రెండు సెట్లను సొంతం చేసుకుని టైటిల్‌ను ముద్దాడాడు. ఈ టోర్నీ క్వార్టర్స్‌లో నాదల్, సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జోకోవిచ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు.