IPL 2023 : ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ల తీరు మారలేదు. షమీ చెలరేగడంతో టాపార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. అమన్ హకీం ఖాన్(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో, 8 వికెట్ల నష్టానికి 130 రన్స్ కొట్టింది. కష్ట సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన అమన్ 41 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. అతడికి అక్షర్ పటేల్(27), రిపల్ పటేల్(23) సహకారం అందించడంతో ఢిల్లీ పోరాడగలిగే స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్లలో షమీ నాలుగు, మోహిత్ శర్మ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.
A fine half-century when the going got tough 👏🏻👏🏻
Maiden IPL fifty for Aman Khan 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #GTvDC pic.twitter.com/UbluzqN5OH
— IndianPremierLeague (@IPL) May 2, 2023
Swing ✅
Accuracy ✅
Precision ✅@MdShami11 was in 🔝 form with the ball today 🔥🔥Sit back and enjoy his bowling brilliance 🎥🔽 https://t.co/2F6UVHz83d pic.twitter.com/NY3m4Gu7xO
— IndianPremierLeague (@IPL) May 2, 2023
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఢిల్లీని షమీ దెబ్బకొట్టాడు.. తొలి బంతికే ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(0) ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే డేవిడ్ వార్నర్(2)అనవసర సింగిల్‌కు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిలే రస్సో(8), మనీశ్ పాండే(1), ప్రియం గార్గ్(10)ను షమీ పెవిలియన్ పంపాడు. అమన్ ఖాన్, అక్షర్ పటేల్,రిపల్ పటేల్ ఆదుకున్నారు. వీళ్లు ఆరో , ఏడో వికెట్‌కు 50 రన్స్ జోడించారు.