Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ టూర్‌కు దూరం
Nitish Kumar Reddy: ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయపడ్డాడు. దీంతో అతను ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడు. తొడ కండరాల గాయం వల్ల అతను ఆ టోర్నీతో పాటు ఇంగ్లండ్ సిరీస్‌ను కూడా మిస్ కానున్నాడు. అతను కోలుకునేందుకు 4 వారాలు పట్టనున్నది.
న్యూఢిల్లీ: టీమిండియాకు భారీ జలక్ తగిలింది. ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Reddy).. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడు. తొడ కండరాల గాయం వల్ల అతను ఆ టోర్నీకి దూరం అవుతున్నాడు. ఇటీవల ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతను గాయపడ్డాడు. అయితే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పాత్రను పోషిస్తాడని అనుకున్న నితీశ్ రెడ్డి అనూహ్య రీతిలో ఐర్లాండ్ సిరీస్‌ను మిస్ కానున్నాడు.
ఎడమకాలి కండరంలో వాపు వచ్చినట్లు ఎంఆర్ఐ స్కానింగ్‌లో తెలిసిందని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. అయితే బెంగుళూరులోని సీఓఈలో కోలుకునేందుకు అతను వెళ్లాడు. నితీశ్ రెడ్డి కోలుకునేందుకు కనీసం నాలుగు వారాలు పడుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఒకవేళ ఆ టైం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా భావించారు.
23 ఏళ్ల నితీశ్ రెడ్డి ఇప్పటి వరకు 10 టెస్టులు, ఆరు వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో అతను రెండు వన్డేలు ఆడాడు. లక్నో మ్యాచ్‌లో అతను ఆడలేదు. గాయం చిన్నదే అని తొలుత భావించారు. కానీ స్కానింగ్‌లో ఆ నొప్పి తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. నొప్పి వల్ల నితీశ్ పేస్ బౌలింగ్ చేయలేకపోతున్నట్లు గుర్తించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

