Sai Ananya | అంబర్‌పేట, డిసెంబర్ 20: చండీగఢ్ వేదికగా జరిగిన ఆల్ఇండియా టెన్నిస్ అసోసియేషన్(ఏఐటీఏ) ఆధ్వర్యంలో జరిగిన అండర్-18 టోర్నీలో తెలంగాణ ప్లేయర్ వారణాసి సాయిఅనన్య రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో అనన్య 3-6, 1-6 తేడాతో ఆనందిత ఉపాధ్యాయ(హర్యానా) చేతిలో ఓడి రన్నరప్ టైటిల్ దక్కించుకుంది.
తుది పోరులో ప్రత్యర్థికి దీటైన పోటీనివ్వడంలో ఈ యువ ప్లేయర్ విఫలమైంది. అనన్యకు టోర్నీ నిర్వహకులు దినేశ్ అరోరా, హిమాంశు మాలిక్ ట్రోఫీతో పాటు సర్టిఫికేట్ అందజేశారు.