లండన్ : వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఒకే రోజు రెండు సంచలనాలు. డిఫెండింగ్ చాంప్, టైటిల్ ఫేవరెట్ ఇగా స్వియాటెక్, రెండో సీడ్ ఎలెనా రిబకినా మూడో రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఫిలిప్పీన్స్‌కు చెందిన 21 ఏండ్ల యంగ్ సెన్సేషన్ అలెగ్జాండ్రా ఈలా 7-6(9/7), 6-2 తో స్వియాటెక్‌ను ఓడించింది.
దాంతో ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రి క్వార్టర్స్ చేరిన ఫిలిప్పీన్స్ ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. మరో మ్యాచ్‌లో రిబకినా (కజకిస్థాన్) 6-7 (4/7), 1-6తో 25వ సీడ్ ఎలీస్ మర్టెన్స్ (బెల్జియం) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో మాడిసన్ కీస్ 3-6, 6-2, 6-3తో అనిసిమోవాను, 13వ సీడ్ పావోలిని (ఇటలీ) 6-1, 6-2తో మరియా సకారి (గ్రీస్)ను ఓడించారు.
కాగా గాయం కారణంగా అమెరికా లెజెండ్ సెరెనా విలియమ్స్ తన అక్క వీనస్‌తో డబుల్స్ ఈవెంట్ నుంచి వైదొలిగింది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-2, 7-6 (7/4), 6-4తో గిరోన్ (అమెరికా)ను ఓడించి ప్రిక్వార్టర్స్ చేరాడు. ఐదో సీడ్ డి మినార్, లెహెకా, కొబోలి కూడా ముందంజ వేశారు.