మెల్బోర్న్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుపై ఆస్ట్రేలియా మరింత పట్టు బిగించింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోయి 15 పరుగులు చేసింది. మరో రెండు రోజులు మిగిలున్న ఆటలో సఫారీలు 371 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 386/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 575/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్, బ్యాటర్ అలెక్స్ క్యారీ(111) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. ఆసీస్ తరఫున క్యారీ టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. నోర్జె(3/92),రాణించాడు.