Carlos Alcaraz | లండన్: వింబుల్డన్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లొస్ అల్కారజ్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో అల్కా రజ్ 5-7, 6-2, 4-6, 7-6 (7/2), 6-2తో ఫ్రాన్సెస్ టియాఫో(అమెరికా)పై అతి కష్ట మ్మీద గెలిచాడు. గెలుపు కోసం ఇరువురూ నువ్వానేనా అన్నట్టుగా తలపడటంతో మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది.
అల్కారజ్ 16 ఏస్‌లు సంధించి 55 విన్నర్స్ కొట్టగా ఫ్రాన్సెస్ 9 ఏస్‌లు, 39 విన్నర్స్‌కు పరి మితమయ్యాడు. ఆరు డబుల్ ఫాల్ట్స్ చేసిన టియా అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో ఏడో సీడ్ ఇటలీ అమ్మాయి జాస్మిన్ పలోని 7-6 (7/4), 6-1తో బియాంకా(కెనడా)పై అలవోకగా నెగ్గింది.