AUSW vs SAW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాకు భారీ షాక్. విధ్వంసక ఆటతో.. వరుస విజయాలతో సెమీఫైనల్ చేరిన సఫారీ టీమ్.. చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం పసికూనను తలపిస్తూ వంద లోపే ఆలౌటయ్యింది. ఇండోర్ మైదానంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ అలనా కింగ్(7-18) విజృంభణతో 97 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(31), వికెట్ కీపర్ సినాలో జఫ్తా(29)లు రాణించడంతో గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది సఫారీ సైన్యం.
ప్రపంచకప్‌లో జోరుమీదున్న రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్. టేబుల్ టాపర్‌ను నిర్ణయించే మ్యాచ్ కావడంతో ఇంకేముంది హోరాహోరీ తప్పదు అనుకున్నారంతా. కానీ, ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ దక్షిణాఫ్రికాను వణికించింది. టీమిండియా, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి జట్లను ఓడించి సెమీస్ చేరిన సఫారీ టీమ్.. లీగ్ దశ చివరి గేమ్‌లో మాత్రం తేలిపోయింది. స్పిన్నర్ అలనా కింగ్(7-18) తిప్పేయగా.. బ్యాటర్లు సమిష్టిగా విఫలమవ్వడంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.
First seven-wicket haul in the Women’s @cricketworldcup belongs to Alana King 👸
Watch #AUSvSA LIVE in your region, #CWC25 broadcast details here ➡️ https://t.co/MNSEqhJP29 pic.twitter.com/XgePPEEOUV
— ICC Cricket World Cup (@cricketworldcup) October 25, 2025
కెప్టెన్ లారా వొల్వార్డ్త్(31)ను ఔట్ చేసిన మేగన్ షట్ తొలి వికెట్ అందించగా.. ఫామ్‌లో ఉన్న తంజిమ్ బ్రిట్స్(6)ను కిమ్ గార్త్ పెవిలియన్ చేర్చింది. అక్కడి నుంచి అలనా కింగ్ సఫారీలను దెబ్బకొడుతూ వచ్చింది. తొలుత.. సునే లుస్(6)ను ఔట్ చేసిన తను.. అనెరీ డిర్కెసెన్(5), గత మ్యా్చ్లో హాఫ్ సెంచరీ బాదిన మరినే కాప్(0), సినాలో జఫ్తా(29), చ్లో ట్రయాన్(0), నడినే డీక్లెర్క్(14), మసబత క్లాస్(4)లను ఔట్ చేసి.. ఏడో వికెట్ సాధించింది. కింగ్ విజృంభణతో 24 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.