యాచారం: గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన 7వ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ టోర్నీలో యాచారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అక్షిత సత్తాచాటింది. ఒకటి కాదు రెండు కాదు మూడు బంగారు పతకాలు సొంతం చేసుకుని శభాష్ అనిపించుకుంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం సాకలోనిపల్లి గ్రామానికి చెందిన అక్షిత యాచారం ప్రభుత్వ హాస్టల్లో వుంటూ 10వ తరగతి చదువుతున్నది.
గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 7వ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ 100మీ. 200మీ రేసుల్లో స్వర్ణాలు సాధించిన అక్షిత..లాంగ్జంప్లోనూ మరో పసిడి దక్కించుకుంది. ఈ అద్భుత ప్రదర్శన ద్వారా చెన్నై వేదికగా ఫిబ్రవరిలో జరిగే జాతీయ పారా అథ్లెటిక్స్ టోర్నీకి అక్షిత ఎంపికైంది.