ఢిల్లీ : యువ షూటర్ ఆకృతి దహియా, ఒలింపియన్ అంజుమ్ మోడ్గిల్ ఆసియా చాంపియన్షిప్ (రైఫిల్/పిస్టోల్)లో పతకాలతో మెరిశారు. ఢిల్లీలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో 24 ఏండ్ల ఆకృతి.. 343.8 పాయింట్లు సాధించి రెండో స్థానాన నిలువగా 340.4 పాయింట్లతో అంజుమ్ కాంస్యం గెలిచింది.
కజకిస్థాన్ షూటర్ సొఫియా షుజెంకొ (358.2) అగ్రస్థానంతో ప్రపంచ రికార్డు సృష్టించడమే గాక స్వర్ణాన్ని దక్కించుకుంది.