హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర యువ వెయిట్‌లిఫ్టర్ సర్గారీ అఖిల్‌రెడ్డి జాతీయ స్థాయిలో మరోమారు తళుక్కుమన్నాడు. నాగర్‌కోయిల్(తమిళనాడు) వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో అఖిల్ కాంస్య పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన పురుషుల 109కిలోల విభాగంలో బరిలోకి దిగిన అఖిల్ స్నాచ్‌లో 144కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 174కిలోలు, మొత్తం 318 కిలోలు ఎత్తి ఔరా అనిపించాడు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిచ్చిన ఈ యువ లిఫ్టర్ పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. రైల్వేస్, ఆర్మీ లిఫ్టర్లు వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో ముందుకు సాగేందుకు సర్వేజన సుఖినోభవంతు ఫౌండేషన్ మద్దతుగా నిలిచిందని ఈ సందర్భంగా అఖిల్ పేర్కొన్నాడు. జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న అఖిల్‌ను కోచ్ శివకేశవ్ యాదవ్ అభినందించాడు.