గురుగ్రామ్ : భారత బాక్సింగ్ అసోసియేషన్(బీఎఫ్ఐ)లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభను తెరపడింది. హోరాహోరీగా సాగిన బీఎఫ్ఐ ఎన్నికల్లో అజయ్‌సింగ్ హ్యాట్రిక్ విజయంతో ముచ్చటగా మూడోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నాడు.
వాయిదా పడుతూ వచ్చిన అసోసియేషన్ ఎన్నికల్లో అజయ్‌సింగ్ 40-26 తేడాతో ప్రత్యర్థి జస్లాల్ ప్రధాన్‌పై విజయం సాధించాడు. ప్రధాన కార్యదర్శిగా ప్రమోద్‌కుమార్, కోశాధికారిగా పోన్ భాస్కరన్ ఎన్నికయ్యారు.