BFI : భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా అజయ్ సింగ్(Ajay Singh) వరుసగా మూడోసారి ఎన్నికయ్యాడు. ఏకపక్షంగా సాగిన పోటీలో ఆయన ప్రత్యర్థి జస్లాల్ పర్ధాన్పై 26 ఓట్ల తేడాతో గెలుపొందాడు. రాష్ట్ర స్థాయి సంఘాల మద్దతుతోనే తాను హ్యాట్రిక్ విక్టరీ కొట్టానని. భారత బాక్సింగ్‌కు తన మరో దఫా సేవల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అజయ్ అన్నాడు. రాష్ట్రాలకు చెందిన 34 సంఘాలు 66 ఓట్లతో ఈ ఎన్నికలో పాల్గొన్నాయి.
తనకు మూడోసారి అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు అందరికీ అజయ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఈ విజయం నాపై మీకున్న నమ్మకానికి ప్రతీక. ఇది విజయం మాత్రమే కాదు ఇన్నేళ్లుగా భారత బాక్సింగ్ పురోగతి మా బృందం అలుపెరగకుండా చేస్తున్న కృషికి దక్కిన గౌరవం. ఈ సందర్భంగా బీఎఫ్ఐ మధ్యంతర కమిటీ, అబ్జర్వర్ ఫయరుజ్ ముహమ్మద్ ప్రత్యేక ధన్యవాదాలు.
🚨Ajay Singh re-elected as President of the Boxing Federation of India! 🥊
With popular support, Mr. @AjaySingh_SG continues at the helm to drive Indian boxing towards greater global success. 🇮🇳✨@RealWorldBoxing @RealAsianBoxing #BFI #PunchMeinHaiDum pic.twitter.com/6gfUwNyG4q
— Boxing Federation (@BFI_official) August 21, 2025
నాతో పాటు బీఎఫ్ఐ సభ్యులుగా ఎంపికైన మిత్రులందరికీ శుభాకాంక్షలు. త్వరలోనే వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలు ఉన్నాయి. ప్రస్తుతం మా దృష్టంతా మన బాక్సర్లు గొప్పగా రాణించి.. దేశానికి పతకాలు తీసుకువచ్చేలా చేయడం మీదనే ఉంది’ అని అజయ్ సింగ్ వెల్లడించాడు. సెక్రటరీ జనరల్ పదవి కోసం ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రమోద్ కుమార్ ఎంపికయ్యాడు. సమీప ప్రత్యర్ధి దిగ్విజయ సింగ్‌పై 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కోశాధికారి పోస్ట్‌ను పాన్ బక్సరన్ దక్కించుకున్నాడు.