కాటారం, నవంబర్ 17 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థి అజయ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు.
ఇటీవల మహాబూబ్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్-17 విభాగంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు తరపున పాల్గొన్న అజయ్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ నెల 27 నుంచి 30 వరకు కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరులో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో అజయ్ పాల్గొంటాడని వెల్లడించారు.