హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఏఐటీఏ మహిళల టెన్నిస్ టోర్నీలో శ్రీమన్యరెడ్డి, చందన జోడీ రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీమన్యరెడ్డి, చందన ద్వయం 1-6, 3-6తో ఆకృతి, పార్థసారధి ముండే(మహారాష్ట్ర) జంట చేతిలో ఓటమిపాలైంది.
మ్యాచ్ ఆసాంతం శ్రీమన్య, చందన మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నించినా ప్రత్యర్థి దీటుగా స్పందించడంతో రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.